AP రాజధాని విషయంలో చర్చనీయాంశంగా మారిన నౌకదళ ప్రకటన | Navy Announcement Become a Topic of Discussion

AP రాజధాని విషయంలో చర్చనీయాంశంగా మారిన నౌకదళ ప్రకటన | Navy Announcement Become a Topic of Discussion

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం.. హైకోర్టు విచారణలో ఉన్న సమయంలో..... భారత నౌకాదళానికి చెందిన ఓ యుద్ధనౌకకు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ....జారీ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ముంబై డాక్ యార్డ్ లో నిర్మాణ మవుతున్న 15 B గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకకు ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం పేరు పెట్టామంటూ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి అధికారికంగా పత్రిక ప్రకటన జారీచేశారు. తూర్పునౌకాదళ కమాండ్ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నిన్న ఏపీ సీఎం జగన్ ను కలిసి... డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి హాజరు కావాలంటూ ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్మితమవుతున్న యుద్ధ నౌక 15బి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ కు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామని.... వైస్ అడ్మిరల్ అజేంద్ర సింగ్... జగన్ కు వివరించినట్టుగా నౌకాదళం ప్రకటనలో వెల్లడించింది. ఏపీ రాజధాని అంశంపై హైకోర్టు విచారణలో ఉండటంతో పాటు..కేంద్ర హోంశాఖ నిర్ధరించకుండా ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం అని నౌకాదళం తన ప్రకటనలో పేర్కొనటం చర్చనీయాంశమైంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments